![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైర్ చూపిస్తూ ఒక్కొక్కరి బాక్స్ బద్దలు కొట్టేశాడు. ఇక తొలివారం కాబట్టి ఎగ్జైట్‌మెంట్ మామూలుగా లేదు. నాగార్జునని చూడగానే.. ప్రతీ సీజన్‌లోని కంటెస్టెంట్స్ మాదిరిగానే.. వావ్ సర్.. హ్యాండ్సమ్ సర్ అంటూ హౌస్‌లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ పొగిడేశారు. సంజనా అయితే లవ్ సింబల్ చూపిస్తూ.. చాలా అందంగా ఉన్నారు సర్.. మిమ్మల్ని చూడగానే రిఫ్రెష్ అయిపోయాం.. చాలా కొత్తగా కనిపిస్తున్నారని అనగా.. నాగార్జున కూడా లవ్ సింబల్‌ని చూపించేసి.. నీలో కూడా రోజుకో కొత్త పర్సన్ కనిపిస్తున్నారన్నాడు. దెబ్బకి హౌస్ అంతా చప్పట్లు కొట్టేశారు. కొత్త పర్సన్ కనిపించడం కాదు సర్.. తనలోకి కొత్త పర్సన్‌ని చూపిస్తుందని ఇమ్మాన్యుయల్ అన్నాడు.
నాగార్జున హౌస్ లో ఉన్నవాళ్ళందరిని పలకరించాడు. సోల్జర్ డ్యూటీ ఎలా ఉందని పవన్ కళ్యాణ్ ని అడుగగా.. పర్లేదు సర్ హ్యాండిల్ చేయొచ్చని అతను అన్నాడు. రీతూని లేపి.. నీ లక్కీ కలర్ బ్లూ అన్నావ్ కదా.. మరి నువ్వెందుకు వేసుకోలేదని నాగార్జున అడిగాడు. మీరు వేసుకుని వచ్చారు కదా.. మీ లక్ నాకు అంటించండి అని రీతూ అంది. దాంతో నాగార్జున.. ఆమె ఎదపై డిష్ వాషర్ అని బ్లూకలర్ బోర్డ్‌ని జిరాక్స్ తీసిన నాగార్జున.. దానిపై ఉందిలే బ్లూ అంటూ మన్మథుడు అని అనిపించాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ తో సరదాగా మాట్లాడాడు. నువ్వు కూర్చో గుండు అంకుల్ తర్వాత మాట్లాడుకుందామని అన్నాడు. ఇక ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిన సంజనకి క్లాప్స్ కొట్టాడు నాగార్జున. సర్. ఎవరూ కెప్టెన్ మాట వినడం లేదు.. చాలా బాధలు ఉన్నాయి సర్ చెప్పుకోవాలని సంజనా అంది. తర్వాత మాట్లాడుదామని కూర్చోమన్నాడు.
ఇక ఆట మొదలెడదామా అని స్టార్ట్ చేశాడు. ఫ్రీ బర్డ్‌తో మొదలుపెడతామంటూ ఆ కార్డ్ తీసి సంజనా, ఫ్లోరా షైనీల మధ్య జరిగిన ఫ్రీ బర్డ్ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాడు. రాము రాథోడ్.. మీకు పెళ్లైందా అని నాతో మాట్లాడుతుంటే.. నేను రిలేషన్‌లో ఉన్నానని చెప్పా. ఇంతలో సంజనా వచ్చింది. నన్ను ఫ్రీ బర్డ్ అని చెప్పిందని కంప్లైంట్ చేసింది ఫ్లోరా. ఫ్రీబర్డ్ అంటే తప్పు కాదు సర్.. ఏ డిక్షనరీలో చూసినా అదేం తప్పు పదం కాదని సంజనా సమర్ధించుకుంది. దాంతో వీడియో వేసి చూపించారు నాగార్జున. నేను క్లీయర్‌గానే చెప్పాను కదా సర్.. ఆమెకి అది తప్పుగా అర్థమయ్యింది. అయితే ఫ్లోరాను పర్సనల్‌గా టార్గెట్ చేసిందని హౌస్‌లో ఉన్న వాళ్లంతా సంజనాను తప్పు పట్టారు. ఇక ఫ్లోరాకి కాఫీ ఇవ్వొద్దని సంజనా చెప్పిందని హౌస్‌లో వాళ్లు చెప్పడంతో సంజనాకి క్లాస్ పీకి ఆమె బాక్స్ కూడా బద్దలు కొట్టేశాడు నాగార్జున.
ఆ తర్వాత సంజనా గురించి ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడంతో దానిని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజనా. దాంతో నాగ్ క్షమాపణ చెప్పమన్నారు. అందరి ముందు సంజనాకి క్షమాపణ చెప్పింది ఫ్లోరా. ఇక తనూజని ధైర్యంగా ఉండమని నాగార్జున చెప్పాడు. ఏడ్వొద్దు తనూజా.. నిన్ను ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. నువ్వు ఏడ్వొద్దు. ధైర్యంగా ఎదుర్కో..మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని ఇన్ డైరెక్ట్‌గా మాస్క్ మ్యాన్ కి చురకలు వేశాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. నిందను తనూజ మీదికి నెట్టేసిన ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు నాగార్జున.
![]() |
![]() |